కోవిడ్ టీకా కావాలంటే.. మద్యానికి దూరంగా ఉండాల్సిందేనా..!
- విచారంలో మద్యంప్రియులు.. తప్పదంటున్న కోవిడ్ వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ కమిటీ
2019లో చివర్లో చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మరి ఏడాదికాలంగా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. 2020 చివరి నాటికి కరోనా మహమ్మరికి సైంటిస్టులు వ్యాక్సిన్ కొనుగొనడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.
కరోనా సైతం అదే సమయంలో కొత్త స్ట్రెయిన్ ను తయారు చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే తయారైన కోవిడ్ వ్యాక్సిన్ కరోనా కొత్త స్ట్రెయిన్ పై పని చేస్తుందా? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
సైంటిస్టులు మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్ కరోనా కొత్త స్ట్రెయిన్ పై పని చేస్తుందని పేర్కొంటున్నారు. అవసరమైతే ఆరువారాల్లో కొత్త టీకాను రెడీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
కోవిడ్ టీకా తీసుకునే వాళ్లు మద్యానికి దూరంగా ఉండాలని కోవిడ్ వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ కమిటీ చెబుతోంది. లేనట్లయితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందని.. వ్యాక్సిన్ సానుకూలంగా స్పందించదని పేర్కొంటున్నారు.
కోవిడ్ టీకాకు ముందు.. ఆ తర్వాత మద్యానికి కొంత గ్యాప్ ఇవ్వాలని ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రానక్స్ ఇఖారియా సూచిస్తున్నారు.
కోవిడ్ టీకాలు వేయించుకున్న వారిలో నుంచి మద్యం సేవించే వారి శాంపిల్స్ సేకరించినట్లు ఇఖారియా తెలిపారు. వీరిలోని తెల్ల రక్త కణాల్లో ఉండే లింఫోసైట్ 50శాతం మేర పడిపోయినట్లు గుర్తించినట్లు ఇఖారియా పేర్కొన్నారు.
అమెరికా మాంచెస్టర్ యూనివర్సిటీ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ షీనా క్రూక్‌శాంక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరీరంలో లింఫోసైట్లు తగ్గడం వల్ల రోగనిరోధకపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
అందుకే కోవిడ్ టీకా తీసుకునే వాళ్లు కొన్నిరోజుల ముందు నుంచే మద్యానికి దూరంగా ఉండాలని క్రూక్‌శాంక్ చెబుతున్నారు. టీకా తీసుకునే ముందురోజు మద్యం తీసుకోవడం వల్ల లింఫోసైట్ల పనితీరు స్తంభించిపోతుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also read: కోవిడ్ టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం?
0 Comments