కన్నకూతురికి సెల్యూట్ చేసిన తండ్రి.. ప్రశంసలు కురిపించిన నెటిజన్లు..!
- అరుదైన సంఘటనకు వేదికైన పోలీస్ డ్యూటీ మీట్-2021
సృష్టి మూలం ఆడది. ఆడదే ఆధారం.. అని చాలామంది మరిచిపోతుంటారు. ఓ కూతురుగా.. అక్కగా.. చెల్లిగా.. తల్లిగా.. భార్యగా.. ఉద్యోగిణిగా.. నాయకురాలిగా పలువిధాలుగా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తూ సమాజంలో అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.
చాలామంది తల్లిదండ్రులు పుత్రుడు పుట్టినపుడో.. లేదంటే ఆ పుత్రుడు ప్రయోజకుడైనపుడు సంతోష పడుతుండటం చూస్తుంటాం. మగవాళ్లు ఎక్కువ.. ఆడవాళ్లు తక్కువ అని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుండం సమాజంలో చుస్తూనే ఉంటాం. అయితే ఓ పుత్రిక తన తండ్రిచే సెల్యూట్ చేయించుకొని. ఆ తండ్రికి పుత్రికోత్సాహం కలుగజేసిన సంఘటన చాలా అరుదుగా జరుగుతుంటాయి.
ఇలాంటి అరుదైన సంఘటన ఏపీలో తాజాగా జరిగిన పోలీస్ డ్యూటీ మీట్-2021లో జరిగింది. పోలీస్ శాఖలో తండ్రికూతుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి కల్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో తండ్రి శ్యామ్ సుందర్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతని కూతురు జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా పని చేస్తున్నారు.
తాజాగా తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్-2021లో భాగంగా ‘దిశ’ బాధ్యతలను జెస్పీ ప్రశాంతి చూసుకుంటున్నారు. ఇక్కడే ఆమె తండ్రి విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలోనే ఉన్నతాధికారులతో బాధ్యతలు నిర్వహిస్తున్న తన కూతురు జెస్సీని తండ్రి శ్యామ్ సుందర్ సెల్యూట్ చేశాడు.
దీనికి ప్రతీగా జెస్సీ సెల్యూట్ చేసింది.. ఏంటీ నాన్న అంటూ సిగ్గుపడటం కన్పించింది. ఈ సంఘటన చూసిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తండ్రి కూతురు ఒకే యూనిఫాంలో విధులు నిర్వహించం గర్వంగా ఉందన్నారు. తన తండ్రికి పుత్రోకోత్సాహం కలిగించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు సైతం తండ్రి కూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడపిల్లలను కన్నతల్లిదండ్రులకు పాదాభివందనాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఓ అరుదైన సంఘటనకు పోలీస్ డ్యూటీ మీట్-2021 వేదిక కావడంపై పోలీస్ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags: CI Father salutes DSP Daughter, Police duty meet-2021, Father salutes daughter, Namaste Madam, CI Salutes DSP Daughter, Proud father, salutes police officer daughter, Proud father salutes daughter, Father on duty saluting DSP, Father salutes daughter, Proud Cop Father Salutes IPS Daughter, CI Salutes DSP Daughter.
0 Comments