Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Check Telugu Movie First Glimpse goes viral

నితిన్ కు ‘చెక్’ పెట్టిందెవరు?

  • వైరల్ అవుతున్న చెక్ తెలుగు టీజర్.

check telugu movie

2020 సంవత్సరం అందరు హీరోలు ఎలా ఉన్నా నితిన్ మాత్రం బాగానే కలిసొచ్చింది. 2020లో నితిన్ నటించిన ‘భీష్మ’ విడుదలై బ్యాక్సాఫిక్ వద్ద విజయం సాధించింది. 

భీష్మ మూవీ కలెక్షన్లు తగ్గముఖం పట్టిన తర్వాతే భారత్ లోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రం లాక్డౌన్ విధించగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఈ ప్రభావమే సినిమాపై పడకపోవడంతో చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది. 

నితిన్ పెళ్లి ఏప్రిల్ ఫిక్స్ కాగా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో వాయిదా పడింది. అయితే ఆ తర్వాత కరోనా నిబంధనలు పాటిస్తూ జూలై 26న నితిన్.. షాలిని పెళ్లి జరిగింది. వీరిద్దరి ప్రేమ వివాహం కావడం విశేషం. 

భీష్మ ముందు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ’లో నటించి మంచి విజయం అందుకున్నారు. కొన్నాళ్లుగా నితిన్ భారీ విజయాలను అందుకుంటూ టాప్ హీరోల లిస్టులో చేరాడు. 

2021లోనూ నితిన్ పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బీజీగా ఉన్నాడు. ఇప్పటికే నితిన్.. కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు పవర్ పేట.. చెక్ మూవీల్లో నితిన్ నటిస్తున్నాడు. 

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ మూవీ రాబోతుంది. ఢిపరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చెక్ తెలుగు టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 41సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

చెక్ టీజర్లో హీరో నితిన్ ను జైల్లో ఖైదీగా చూపించారు. చెస్ లో ఆటలో నితిన్ ఆరేతేరిన వాడినా.. విశ్వనాథ్ ఆనంద్ తో పోల్చాడం చూపించారు. ఇంతలో ఐదుగురు నేరస్థులను ఉరి తీయడానికి తీసుకెళుతుంటారు. 

నితిన్ ను పట్టుకొని ఓ పోలీస్ ఆఫీసర్  తీవ్రవాది.. టెర్రరిస్ట్.. దేశద్రోహి అంటూ అరవడం కన్పించింది. ఆ వెంటనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'హిస్ ఇన్నోసెంట్' అని అనడం ఆసక్తిని రేపుతోంది. 

చెక్ మూవీకి చెస్ ఆటకు.. జైలు గోడల మధ్య సినిమా ప్రధానంగా సాగనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. నితిన్ జైలుకు ఎందుకు వెళ్లడనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి చెక్ తెలుగు టీజర్ అభిమానులను ఆకట్టుకుండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 

చెక్ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. చెక్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

Tags: Check Telugu Movie, Check Teaser, Check movie cast, check movie realase date, First Glimpse Check Movie, Nithin Check Telugu Movie, Check Movie First Glimpse, Nithin Rakul Preet Singh, Nithin Rakul priya warrior, Check movie poster, Check Telugu Movie 2021, Nithin biography, Shalini Reddy Age, Nithin Tollywood, చెక్ తెలుగు మూవీ, చెక్ మూవీ, నితిన్ చెక్ మూవీ, నితిన్ పెళ్లి.

Post a Comment

0 Comments