వంటలక్క కాస్తా.. మహానటి అయింది..!
- మహానటి సావిత్రితో దీపను పోలుస్తున్న నెటిజన్లు.. సంబరపడిపోతున్న వంటలక్క..!
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ హవా కొనసాగుతోంది. ఈ సీరియల్ మొదలైన నాటి నుంచి మహిళలంతా వంటలక్కకు నీరాజనాలు పడుతున్నారు. దీంతో ఈ సీరియల్ తెలుగు ఛానళ్లలో అత్యధిక టీఆర్పీని దక్కించుకొని నెంబర్ వన్ కొనసాగుతోంది.
కార్తీక దీపం సీరియల్ దరిదాపుల్లో ఏ సీరియల్ రేటింగ్ కూడా లేదంటే నమ్మశ్యం కాదేమో. అంతలా ఈ సీరియల్ టీఆర్పీలో దూసుకెళుతోంది. వంటలక్క అలియాస్ దీప పాత్రకు మహిళలతోపాటు మగవాళ్లు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ సీరియల్ ను ఇంటిల్లీపాది ఇష్టపడి చూస్తున్నారు. దీంతో ఈ సీరియల్ ప్రతీయేటా నెంబర్ వన్ గా కొనసాగుతోంది. మాటీవీలో ఇటీవల వచ్చిన బిగ్ బాస్-4 సైతం వంటలక్కను బీట్ చేయలేకపోయిందంటే ఈ సీరియల్ హవా ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలనే డిమాండ్స్ కూడా వచ్చాయి. ఐపీఎల్-2020 కార్తీక దీపం సీరియల్ టైంలో ప్రసారం కానుందని ప్రకటన రావడంతో వంటలక్క అభిమానులు టైం మార్చాలని డిమాండ్ ను సోషల్ మీడియాలో పెద్దఎత్తున చేయడం కన్పించింది.
ఇదిలా ఉంటే వంటలక్క అలియాస్ దీపను అభిమానులంతా మహానటి సావిత్రితో పోల్చుస్తుండటం విశేషం. ఆమె నటనకు ఫిదా అవుతున్న అభిమానులంతా మహానటితో వంటలక్కను పోలుస్తూ ప్రశంసలవర్షం కురిస్తున్నారు.
అభిమానుల కామెంట్లను చూసిన వంటలక్క అలియాస్ దీప ఉబ్బితబ్బిబవుతోంది. అభిమానుల కామెంట్లపై వంటలక్క స్పందిస్తూ.. ఆమె నటనలో కొంచెం చేసినా.. నా జన్మ ధన్యమైనట్టేనని.. తనను మహానటితో పోల్చిన అభిమానులకు ధన్యవాదాలంటూ రిప్లయ్ ఇచ్చింది.
వంటలక్క తన నటనతోనే కాకుండా తన మాట తీరుతోనే అభిమానులను ఆకట్టుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి వంటలక్క కాస్తా బుల్లితెర మహానటి అయిందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. అవును మరీ.. వంటలక్కనా.. మజకానా.. అంటూ ఫ్యాన్స్ సైతం సంబరపడిపోతున్నారు.
Tags: Savitri Kartika deepam, serial Vantalakka, Television Savitri Vantalakka, Karthika Deepam Vantalakka Deepa, Karthika Deepam Vantalakka, Premi Vishwanath, Karthika deepam serial child artist, Kirithika Half saree, KARTHIKA DEEPAM SERIAL TEAM DINNER, వంటలక్క సావిత్రి, Television Vantalakka, became the great Savitri.
0 Comments