తెలంగాణ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ జర్నీ..!
- హైదరాబాద్ టూ షికాగోకు నాన్ స్టాప్ విమాన సర్వీసు ప్రారంభం
Hyderabad to Chicago Fight Service |
అమెరికా వెళ్లేవారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ తెలియజేసింది. హైదరాబాద్ నుంచి అమెరికా నాన్ స్టాప్ జర్నీకి ఎయిర్ ఇండియా శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే ఒకటి రెండుచోట్ల దిగి అక్కడి నుంచి వేరే ప్లైట్ల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ఎయిర్ ఇండియా హైదరాబాద్-షికాగో విమాన సర్వీసును తాజాగా ప్రారంభించింది.
తెలంగాణలో ఏకైక విమానశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్టే. జనవరి 15 మధ్యాహ్నం 12.50నిమిషాలకు శంషాబాద్ నుంచి ఎయిర్ ఇండియా 107 బోయింగ్ 777-200విమానం అమెరికాలోని షికాగోకు బయలుదేరి వెళ్లింది. మొత్తం 236మంది ప్రయాణీకులతో హైదరాబాద్ టూ షికాగో తొలి సర్వీసును ఎయిర్ ఇండియా కేక్ కట్ చేసి ఘనంగా ప్రారంభించింది.
తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభమైన నాన్ స్టాప్ సేవలు అమెరికా వెళ్లేవారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్ నుంచి యూఎస్ఏకు తొలి డైరెక్టర్ కనెక్టివిటీ సేవలు దక్షిణాది ఉపయుక్తంగా మారనున్నాయి. కాగా షికాగో విమానం జనవరి 13న అక్కడి నుంచి 237మంది ప్రయాణీకులతో బయలుదేరి జనవరి 14న రాత్రి 12.40కి హైదరాబాద్ కు చేరుకుంది.
జనవరి 15న హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.50నిమిషాలకు హైదరాబాద్ నుంచి షికాగోకు 236మంది ప్రయాణీకులతో తిరుగు ప్రయాణం అయింది. ఈ నాన్ స్టాప్ సర్వీసును ఎయిర్ ఇండియా అధికారులు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి నిర్వహించి వారి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. హైదరాబాద్ టూ అమెరికా నాన్ స్టాప్ సర్వీసు ప్రారంభంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇండియాలో తొలి ఎయిర్ ట్యాక్సీ ప్రారంభం.. ఎక్కడి నుంచంటే?
0 Comments