ఇండియాలోకరోనా తొలి టీకా ఎవరు వేసుకున్నారంటే?
- తెలుగు రాష్ట్రాల్లో తొలి టీకా వేసుకుంది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Carona Vaccine |
2020 తొలినాళ్లలోనే కరోనా మహమ్మరి గురించి ప్రపంచానికి తెల్సింది. 2020 కరోనా సంవత్సరంగా మారిపోగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే అన్నిరంగాలు తిరిగి గాడినపడుతున్నాయి.
ఏడాది కాలంగా సైంటిస్టులు ఎంతో శ్రమించి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారు. అనేక ప్రయోగాల తర్వాత వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇండియాలో జనవరి 16నుంచి అధికారికంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొత్తం ఐదు దశల్లో జరుగనుంది. తొలుత కరోనా వారియర్లుగా పని చేసిన వైద్యులు.. ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలి వ్యాక్సిన్ కరోనా వారియర్ కే వేయడం జరిగింది.
దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్న మనీష్ కుమార్ ఇచ్చారు. అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ రన్ దీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పరిశీలించారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి టీకా ఎవరి కంటే..
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడలోని జీజీహెచ్ కు విచ్చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా తొలి టీకా పారిశుధ్య కార్మికులు పుష్ప కుమారికి తొలి టీకా వేయగా.. రెండో టీకాను నర్సు నాగజ్యోతికి వేశారు.
తెలంగాణలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డిలు ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్న కృష్ణవేణికి కరోనా తొలి టీకా వేయడం జరిగింది. కరోనా వారియర్లకు తొలి టీకా వేయడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.
నేడు కరోనా టీకా తీసుకున్న వారంతా 28రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా టీకా తీసుకున్నప్పటికీ ప్రజలంతా భౌతికదూరం.. మాస్కులు ధరించడం.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని వైద్యులు తెలియజేస్తున్నారు.
0 Comments