ట్రైన్ జర్నీలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ మళ్లీ షూరు..!
- RailRestro యాప్ ద్వారా ఇ క్యాటరింగ్ సేవలను తిరిగి ప్రారంభించనున్న ఇండియన్ రైల్వే
Indian Railway |
దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ప్రయాణాలన్ని రద్దయ్యాయి. బస్సులు.. ట్రైన్లు.. విమాన సర్వీసులన్నీ ఎక్కడికక్కడి నిలిచిపోవడంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే ట్రావెలింగ్ రంగం తిరిగి గాడినపడుతోంది. దీనిలో భాగంగా రైళ్లు.. విమానాలు.. బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
కరోనా నిబంధనలు పాటిస్తూనే రైల్వేలో ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే తరుచూ ట్రైన్లలో ప్రయాణం చేసేవారికి ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రయాణీకులు తమకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునేందుకు ఇక్యాటింగ్ సేవలను తిరిగి ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సన్నహాలు చేస్తోంది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలుత ఎంపిక చేయబడిన స్టేషన్ల నుంచి మాత్రమే పుడ్ డెలివరీలను చేయనున్నారు. జనవరి చివరి వారం నుంచి రైల్వేలో పుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. RailRestro యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ప్రమాణీకులు ఆన్‌లైన్లో ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు.
RailRestro యాప్ లేదా వెబ్‌సైట్లో పీఎన్ఆర్ నంబర్.. ట్రైన్ పేరు.. సీటు వివరాలు వంటివి ఎంటర్ చేసి ఫుడ్ డెలివరీ కోసం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఇచ్చిన వివరాల ప్రకారం ప్రయాణీకులకు ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలోనే ఐఆర్‌సీటీసీ ఈ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటులోగా తాజాగా ఆ సేవలను ఇండియన్ రైల్వే తిరిగి ప్రారంభించనుంది.
Also Read: సికింద్రాబాద్ నుంచి ఏపీకి.. సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు
0 Comments