ఆకట్టుకుంటున్న హోండా గ్రాజియా.. ధర ఎంతంటే?
- అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన హోండా గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్
Honda Grazia Sports Edition |
యువతను ఆకట్టుకునేలా హోండా కంపెనీ ఎన్నోరకాల ద్విచక్ర వాహనాల(బైక్స్)ను తీసుకొచ్చింది. ద్విచక్ర వాహన రంగంలోకి ఇప్పటికే హోండా కంపెనీ టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ఈ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు హోండా కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త బైక్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తూ సత్తాచాటుతోంది.
హోండా కంపెనీ సరికొత్త స్పోర్ట్స్ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(HMCA) హోండా గ్రాజియా పేరుతో కొత్త స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ ను విడుదల చేసింది. స్టాండడ్ హోండా గ్రాజియా 125 సీసీ స్కూటర్లో ఉన్న ఫీచర్లకు కొన్ని అదనపు ఫీచర్లను ఈ స్పోర్ట్స్ ఎడిషన్లో చేర్చారు.
హోండా గ్రాజియాలో స్పోర్ట్స్ ఎడిషన్లో బీఎస్-6 ప్రమాణాలు కలిగిన 125సీసీ ఇంజన్ అమర్చారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాండడ్ హోండా గ్రాజియా 125సీసీ స్కూటర్ల ఫీచర్లతోపాటు అదనంగా సైడ్ స్టాండ్ ఇండికేటర్.. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ను చేర్చారు. హోండా గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ పెరల్ నైట్ స్టార్ బ్లక్.. స్పోర్ట్స్ రెడ్ అనే కలర్స్ లభ్యం కానుంది.
హోండా గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ ఎక్స్ షోరూం ధర రూ.82వేల564గా కంపెనీ నిర్ణయించారు. గురుగ్రామ్ లో ఈ రేటుకు హోండా గ్రాజియా స్పోర్ట్ ఎడిషన్ లభిస్తుండగా ఆయా నగరాల్లోని ఎక్స్ షోరూం ధరల్లో స్పల్పతేడా ఉండే అవకాశం కన్పిస్తోంది. ధర విషయం ఎలా ఉన్నప్పటికీ చూడగానే ఆకట్టునేలా హోండా గ్రాజియా ఉండటం విశేషం.
ఈ స్పోర్ట్స్ ఎడిషన్ ప్రీమియం స్కూటర్ల రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమని హోండా కంపెనీ భావిస్తోంది. యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన హోండా గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ మార్కెట్లో ఎలాంటి రికార్డులను నెలకొల్పుతుందో వేచిచూడాల్సిందే..!
Also Read: బజాజ్ ఆటో ప్రపంచ రికార్డు.. ట్రిలియన్ మార్క్ ను దాటేసిందిగా..!
0 Comments