తెలంగాణలో కొత్త ఓటర్ల లిస్టు.. మొత్తం ఎంతమంది అంటే?
- జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్యను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
New voters list 2021 Telangana |
తెలంగాణలో కొత్త ఓటర్ లిస్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జనవరి 15 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ఒక లక్షా 65వేల 569గా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) డాక్టర్ శశాంక్ గోయల్ తాజాగా వెల్లడించారు.
తెలంగాణలో పురుష ఓట్లర్లు ఒక కోటి 51లక్షల 61వేల 714.. మహిళా ఓటర్లు ఒక కోటి 50లక్షల రెండువేల 227గా ఉన్నారు. అంటే మహిళా ఓటర్ల కంటే ఒక లక్షా 59వేల 487మంది పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో సర్వీస్ ఓటర్లు 13వేల 70మంది.. ఇతర ఓటర్లు 1628మంది ఉన్నారు.
గత నవంబర్ 16నాటికి ప్రకటించిన ముసాయిదా ప్రకారం ఓటర్ల జాబితా మూడుకోట్ల 55లక్షల 327మంది ఉండగా కొత్తగా 2లక్షల 82వేల 497మంది ఓటర్లు చేరారు. తొలగించిన ఓట్లను కలుపుకొని రాష్ట్రంలో జనవరి 15నాటికి మొత్తంగా 3కోట్ల ఒక లక్షా 65వేల 569మంది ఓటర్లు ఉన్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
అత్యధికంగా ఓటర్ల జాబితాలో 20నుంచి 49ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. 20నుంచి 49ఏళ్ల మధ్య 2కోట్ల 15లక్షల 27వేల 426మంది ఉన్నారు. 20జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 68వేల628మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం.. నిర్మల్ జిల్లాలున్నాయి.
జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే..
- ఆసిఫాబాద్ లో పురుష ఓటర్లు 203740.. మహిళా ఓటర్లు 202313, ఇతరులు 13మంది ఉన్నారు.
- మంచిర్యాలలో పురుష ఓటర్లు 295764.. మహిళా ఓటర్లు 292650.. ఇతరులు 43మంది ఉన్నారు.
- ఆదిలాబాద్లో పురుష ఓటర్లు 206798.. మహిళా ఓటర్లు 213644.. ఇతరులు 14మంది ఉన్నారు.
- నిర్మల్ జిల్లాలో పురుష ఓటర్లు 326596.. మహిళా ఓటర్లు 349197.. ఇతరులు 39మంది ఉన్నారు.
- నిజామాబాద్లో పురుష ఓటర్లు 621450.. మహిళా ఓటర్లు 690078.. ఇతరులు 29మంది ఉన్నారు.
- కామారెడ్డిలో పురుష ఓటర్లు 306818.. మహిళా ఓటర్లు 324632.. ఇతరులు 52మంది ఉన్నారు.
- జగిత్యాలలో పురుష ఓటర్లు 320257.. మహిళా ఓటర్లు 340007.. ఇతరులు 19మంది ఉన్నారు.
- పెద్దపల్లిలో పురుష ఓటర్లు 337790.. మహిళా ఓటర్లు 336141.. ఇతరులు 42మంది ఉన్నారు.
- కరీంనగర్ లో పురుష ఓటర్లు 496865.. మహిళా ఓటర్లు 502558.. ఇతరులు 31మంది ఉన్నారు.
- రాజన్న సిరిసిల్లలో పురుష ఓటర్లు 213693.. మహిళా ఓటర్లు 224606.. ఇతరులు 3మంది ఉన్నారు.
- సంగారెడ్డిలో పురుష ఓటర్లు 617713.. మహిళా ఓటర్లు 602245.. ఇతరులు 37మంది ఉన్నారు.
- మెదక్ లో పురుష ఓటర్లు 200830.. మహిళా ఓటర్లు 211592.. ఇతరులు 7మంది ఉన్నారు.
- సిద్దిపేటలో పురుష ఓటర్లు 449565.. మహిళా ఓటర్లు 455566.. ఇతరులు 19మంది ఉన్నారు.
- రంగారెడ్డిలో పురుష ఓటర్లు 1613625.. మహిళా ఓటర్లు 1483650.. ఇతరులు 369మంది ఉన్నారు.
- వికారాబాద్ లో పురుష ఓటర్లు 449641.. మహిళా ఓటర్లు 448759.. ఇతరులు 23మంది ఉన్నారు.
- మేడ్చల్ మల్కాజిగిరిలో పురుష ఓటర్లు 1322485.. మహిళా ఓటర్లు 1217545.. ఇతరులు 283మంది ఉన్నారు.
- హైదరాబాద్ లో పురుష ఓటర్లు 2230046.. మహిళా ఓటర్లు 2081536.. ఇతరులు 221మంది ఉన్నారు.
- మహబూబ్ నగర్ లో పురుష ఓటర్లు 326145.. మహిళా ఓటర్లు 325499.. ఇతరులు 15మంది ఉన్నారు.
- నారాయణపేటలో పురుష ఓటర్లు 215645.. మహిళా ఓటర్లు 220043.. ఇతరులు ముగ్గురు ఉన్నారు.
- నాగర్ కర్నూలులో పురుష ఓటర్లు 333616.. మహిళా ఓటర్లు 328887.. ఇతరులు ఏడుగురు ఉన్నారు.
- వనపర్తిలో పురుష ఓటర్లు 124469.. మహిళా ఓటర్లు 122925.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
- జోగులాంబ గద్వాలలో పురుష ఓటర్లు 226138.. మహిళా ఓటర్లు 228507.. ఇతరులు 10మంది ఉన్నారు.
- నల్లగొండలో పురుష ఓటర్లు 675879.. మహిళా ఓటర్లు 678595.. ఇతరులు 13మంది ఉన్నారు.
- సూర్యాపేటలో పురుష ఓటర్లు 458020.. మహిళా ఓటర్లు 469055.. ఇతరులు 17మంది ఉన్నారు.
- యాదాద్రి భువనగిరిలో పురుష ఓటర్లు 209152.. మహిళా ఓటర్లు 207727.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
- జనగామలో పురుష ఓటర్లు 345899.. మహిళా ఓటర్లు 346649.. ఇతరులు ఆరుగురు ఉన్నారు.
- మహబూబాబాద్ లో పురుష ఓటర్లు 220605.. మహిళా ఓటర్లు 224132.. ఇతరులు 33మంది ఉన్నారు.
- వరంగల్ రూరల్ లో పురుష ఓటర్లు 211147.. మహిళా ఓటర్లు 217868.. ఇతరులు ఒకరు మాత్రమే ఉన్నారు.
- వరంగల్ అర్బన్ లో పురుష ఓటర్లు 365395.. మహిళా ఓటర్లు 372167.. ఇతరులు 177మంది ఉన్నారు.
- జయశంకర్ భూపాలపల్లిలో పురుష ఓటర్లు 132713.. మహిళా ఓటర్లు 131560.. ఇతరులు ఐదుగురు ఉన్నారు.
- ములుగులో పురుష ఓటర్లు 105904.. మహిళా ఓటర్లు 108379.. ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు.
- భద్రాద్రి కొత్తగూడెంలో పురుష ఓటర్లు 445603.. మహిళా ఓటర్లు 465364.. ఇతరులు 25మంది ఉన్నారు.
- ఖమ్మంలో పురుష ఓటర్లు 551708.. మహిళా ఓటర్లు 578151.. ఇతరులు 60మంది ఉన్నారు.
0 Comments