Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

How many graduate voters are there in Warangal Rural District?

 వరంగల్ రూరల్ జిల్లాలో గ్రాడ్యుయేటర్లు ఎంతమంది ఉన్నారంటే?

  • పురుషులు 23వేల112మంది.. మహిళా ఓటర్లు 9వేల720మంది.. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 

MLC graduates-2021, Warangal rural MLC Voters, MLC Voter list latest, MLC voter list Telangana, voter list Telangana
MLC Voters List

త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ రానుండటంతో ఇప్పటికే పలుపార్టీలు అలర్ట్ అయి ముందస్తు ప్రచారాన్ని షూరు చేశాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ప్రచారాన్ని చేపడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. 

వరంగల్ రూరల్ జిల్లాలోని గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాను వరంగల్ రూరల్ జిల్లా ఎన్నికల అధికారి.. కలెక్టర్ హరిత తాజాగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలోని పట్టభద్రుల ఓటర్ల జాబితాను తయారు చేశారు. 

వరంగల్ రూరల్ జిల్లాలో పట్టభ్రదుల ఓటర్లు మొత్తం 32వేల835మంది ఉన్నారు. పురుషులు 23వేల112మంది.. మహిళలు 9వేల729మంది.. ఇతరులు ముగ్గురు ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 14వేల317మంది పట్టభధ్రుల ఓటర్లు ఉన్నారు.

రూరల్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పట్టభ్రదుల ఓటర్ల జాబితా..

వరంగల్ రూరల్ డివిజన్: గీసుకొండలో 2163.. సంగెంలో 1925.. పర్వతగిరిలో 1589.. రాయపర్తిలో 2042.. వర్దన్నపేటలో 1718 మంది పట్టభద్రులు ఉన్నారు. మొత్తంగా వరంగల్ రూరల్ నియోజకవర్గంలో 9వేల437మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. 

నర్సంపేట డివిజన్: నెక్కొండలో 2153.. ఖానాపురంలో 1604.. నర్సంపేటలో 5146.. చెన్నారావుపేటలో 1600.. నల్లబెల్లిలో 1744.. దుగ్గొండిలో 2067.. ఇతరులు ముగ్గురు ఉన్నారు. మొత్తంగా నర్సంపేట నియోజకవర్గంలో 14వేల314మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 

పరకాల డివిజన్: ఆత్మకూరులో 1537.. దామెరలో 1153.. పరకాలలో 3091.. నడికూడలో 1468.. శాయంపేటలో 1832 మంది పట్టభధ్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తంగా పరకాల డివిజన్లో 9వేల81మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. కాగా వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలున్నాయి. 


Also Read: తెలంగాణలో కొత్త ఓటర్ల లిస్టు.. మొత్తం ఎంతమంది అంటే?

Post a Comment

0 Comments