‘ఇండిక్ వికీ ప్రాజెక్ట్’ కోసం దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల వారికి ఇంటర్న్ షిప్ కు అవకాశం
ఆన్ లైన్లో ఏ సమాచారమైన వికీపీడియాలో లభ్యమవుతుంది. వికీపిడియా అందించే సమాచారాన్ని ప్రతీఒక్కరు రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ లభ్యమైనంత సమాచారం తెలుగులో లభించడం లేదు.
వికీపీడియా దీనిని దృష్టిలో ఉంచుకొని తెలుగులో మరింత మెరుగైన సమాచారం అందించేందుకు ‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’ ను చేపట్టింది. వివిధ భాషల్లో వికీపీడియా సమాచారం అందించిస్తుంది. తెలుగులో మరింత మెరుగైన సమాచారం అందించేందుకు వికీపీడియా చర్యలు తీసుకుంటుంటోంది.
డిగ్రీ/పీజీ/ఇంజనీరింగ్ చదువుతున్న లేదా తాజాగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారి నుంచి వికీపీడియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐఐఐటీ-హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’లో ఇంటర్న్ షిష్ చేయడానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులని ఇండిక్ వికీ ప్రతినిధి కశ్యప్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు భాషలో దోషాలు లేకుండా రాయడం తప్పనిసరని.. ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని కశ్యప్ పేర్కొన్నారు. ఇండిక్ వికీ ప్రాజెక్టులో భాగంగా 45రోజుల శిక్షణతోపాటు సర్టిఫికెట్లను అందజేస్తారు.
ఈ శిక్షణలో ప్రతిభ చూపిన వారికి ఉపాధి అవకాశాలతోపాటు ప్రోత్సహకాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వూ షెడ్యూల్ కోసం మీ పరిచయంతో కూడిన ప్రొఫైల్ ను tewiki@iiit.ac.in కు మెయిల్ పంపించాలి. పూర్తి వివరాల కోసం సెల్ నెంబర్ 9014120442 సంప్రదించాలని ప్రాజెక్ట్ ఇండిక్ వికీ ప్రతినిధి కశ్యప్ కోరారు.
0 Comments