సింగరేణిలో భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు..!
- రాతపరీక్ష ద్వారా 651పోస్టులు.. కారుణ్య నియమకాల ద్వారా 1436 పోస్టులు
Singareni job latest notifications |
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే సంస్థల్లో సింగరేణి ముందంజలో నిలుస్తుంది. పుడమిలో దాగివున్న నల్లబంగారాన్ని బయటికి తీసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెలుగులను పంచుతోంది.
సింగరేణి సంస్థలో వేలాది మంది కార్మికులు.. సిబ్బంది.. అధికారులు పని చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకు సింగరేణి ఉపాధి కల్పించింది. ఇప్పుడు తాజాగా మరోసారి సింగరేణి నుంచి నోటిఫికేషన్ రానుంది.
రాతపరీక్ష ద్వారా 651.. ఇంటర్నల్ ద్వారా 1,436 పోస్టుల భర్తీ..
సింగరేణిలో ఖాళీగా 651 పోస్టులను మార్చిలోగా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్నల్ పోస్టుల్లో 1,436మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. పైరవీలకు ఆస్కారం లేదని అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీధర్ సూచించారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు..
సింగరేణిలో ఖాళీగా ఉన్న 651 పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్(NCWA) కింద 569.. మరో 82 అధికారుల పోస్టులకు వేర్వురుగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
569 కార్మిక పోస్టుల వివరాలు..
- జూనియర్ అసిస్టెంట్(క్లర్క్)-177
- ఫిట్టర్లు-128
- ఎలక్ట్రిషియనన్ ట్రైనీలు-51
- వెల్డర్ ట్రైనీలు-54
- టర్నర్, మెషినిస్టు ట్రైనీలు-22
- మోటర్ మెకానిక్ ట్రైనీలు-14
- మౌల్ధర్ ట్రైనీలు-19
- జూనియర్ స్టాఫ్ నర్సులు-84
- ల్యాబ్ టెక్నిషీయన్లు-7
- ఫార్మిసిస్టులు-5
- ఎక్స్ రే-2
- ఈసీజీ-2
- వెంటిలేటర్-3
- ఫిజియోథరపీ-1
- మెనేజ్మెంట్ ట్రైనీలు-39
- పర్సనల్ ఆఫీసర్-17
- ట్రైనీ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్-10
- ట్రైనీ సివిల్-7
- ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-6
- జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్-3
ఇంటర్నల్ ద్వారా(కారుణ్య) నియమకాలు..
- ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టులు-210
- ఈపీ ఆపరేటర్ ట్రైనీలు-178
- క్లర్కులు-177
- వార్డు అసిస్టెంట్లు-175
- ఆయా పోస్టులు-94
- డ్రైవర్లు-64
- వెల్ధర్ ట్రైనీలు-55
- అసిస్టెంట్ ఫోర్ మెన్(మెకానికల్) ట్రైనీలు-56
- ఎలక్ట్రీషియన్ ట్రైనీలు-51
- ఈపీ ఎలక్ట్రీషీయన్ ట్రైనీలు-42
- ఆఫీస్ అసిస్టెంట్(పీవోఏ)-36
- జూనియర్ అకౌంటెంట్లు-24
- టర్నర్ మెషినిస్టు ట్రైనీలు-22
ఇతర పోస్టులను ఇంటర్నల్ సర్యులర్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ నియమకాలన్నీ కూడా మార్చిలోగా భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తులు చేస్తుంది.
0 Comments