కోరమీసాల మల్లన్న.. పెళ్లికొడుకయనే..!
- వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. పులకించిన భక్తులు..!
Komuravelli Mallanna Kalyanam |
జనగామ జిల్లా చేర్యాల మండలంలోని కొమురవెల్లిలో కోరమీసాల మల్లన్న కొలువుదీరాడు. కొమురవెల్లిలో ఎన్నో ఏళ్లుగా మల్లన్న స్వామి పసుపు బండారితో పూజలందుకొంటున్నాడు. ప్రతీయేటా మార్గశిర మాసం ఆదివారం రోజున మల్లన్న కల్యాణం చేయడం ఆనాదిగా వస్తోంది.
2021 జనవరి 10న మార్గశిర మాసం చివరి ఆదివారం కావడంతో నేడు స్వామివారి కల్యాణాన్ని కొమురవెల్లిలో వైభవంగా నిర్వహించారు. కోరమీసాల మల్లన్న.. మేడలమ్మ.. గొల్ల కేతమ్మల కల్యాణ మహోత్సవాన్ని వీరశౌవ ఆగమశాస్త్ర ప్రకారంగా వేదపండితులు.. పూజారులు ఘనంగా నిర్వహించారు.
Minister Harish Rao |
అలాగే ఆలయ సమీపంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వేదికపై కూడా వీరే ముఖ్యపాత్ర పోషించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 6గంటలకు స్వామివారి ఆలయంలో దృష్టి కుంభం నిర్వహించారు. ఉదయం 10.45గంటలకు కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మల్లన్న కల్యాణ మహోత్సవ క్రతవును మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షించారు. వేద పండితులు.. పురోహితులు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణంలో మంత్రులు హరీష్ రావు.. మల్లారెడ్డి.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు.. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామివారి కల్యాణంలో భాగంగా మల్లికార్జునస్వామికి కన్యాదానం కింద మంత్రి హరీశ్‌రావు ఒక లక్షా ఒక వెయ్యి పదహారు రూపాయలు.. మంత్రి మల్లారెడ్డి స్వామివారి తరుపున మేడలమ్మ.. కేతలమ్మలకు రూ.1,01,016లను సమర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
0 Comments