2021లో బెంజ్ నుంచి సరికొత్త మాస్ట్రో.. జిగేల్ మంటున్న ధర..!
- ఢిల్లీలో ఎస్ క్లాస్ షోరూమ్ ధర రూ.1.51 కోట్లు
Mercedes Benz sclass Maestro new edition |
2021 ఏడాదిలో సరికొత్త బెంజ్ కార్లు ఇండియన్ మార్కెట్లో హల్చల్ చేయబోతున్నాయి. దీనిలో భాగంగా తాజాగా సరికొత్త బెంజ్ మోడల్ నూతనంగా మార్కెట్లోకి విడుదలై అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
జర్మనీలో విలాసవంతమైన బెంజ్ కార్ల తయారీకి మెర్సిడెస్ బెంజ్ సంస్థ ప్రసిద్ధి. ఈ సంస్థ తయారు చేసిన ఎస్ క్లాస్ విభాగంలో సరికొత్త ఎడిషన్ ను మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
అధునాతమైన ఫీచర్లతోపాటు కస్టమర్ల అభిరుచి అనుగుణంగా మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎడిషన్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్లో ‘మెర్సిడెస్ మీ కనెక్ట్’ టెక్నాలజీని కంపెనీ తీసుకొచ్చింది.
2021లో విడుదలైన సరికొత్త బెంజ్ కారులో మొమరీ ప్యాకేజీతో ముందును సీట్లను ఏర్పాటు చేయడం.. పనోరమిక్ సన్ రూఫ్ లాంటి సరికొత్త ఫీచర్లను అడ్వాన్స్ గా చేర్చినట్లు తెలుస్తోంది.
ఎస్ క్లాస్ విభాగంలో విడుదలైన ఈ సరికొత్త మాస్ట్రో ఎడిషన్ ఇండియాలోని అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్ షిప్ ల వద్ద లభ్యం కానున్నాయి. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.1.51 కోట్లుగా ఉందని సమాచారం.
Also Read: ఫార్చూనర్ నుంచి లెటేస్ట్ మోడల్ రిలీజ్.. ధర ఎంతంటే?
0 Comments