సికింద్రాబాద్ నుంచి ఏపీకి.. సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు
- ప్రయాణీకుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతున్న దక్షిణ మధ్య రైల్వే
Secundrabad Special Trains |
ప్రతీయేటా మాదిరిగానే ఈ సంక్రాంతి పండుగకు కూడా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడుపనుంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.
సంక్రాంతి సెలవులు.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడుపనుంది. జనవరి 8 నుంచి 17వరకు సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07026/07025) స్పెషల్ ట్రైన్ నడువనుంది.
ఈ స్పెషల్ ట్రైన్ జనవరి 8 నుంచి ప్రతీరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
తిరుగు పయనంలో మధ్యాహ్నం 3.30గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు సికింద్రాబాద్ చేరుకోనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
లింగపల్లి-కాకినాడ(07447) ప్రత్యేక రైలు జనవరి 12తేది రాత్రి 8.50గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55వరకు కాకినాడకు చేరుకోనుంది.
ప్రయాణీకుల రద్దీని బట్టి స్పెషల్ ట్రైన్లు నడిపిందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నహాలు చేస్తుంది. ప్రయాణీకులు ఈ వివరాలను గమనించి స్పెషల్ ట్రైన్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.
Also Read: సంక్రాంతికి TSRTC స్పెషల్ బస్సులు
0 Comments