స్పెయిన్ కళాకారుడి ప్రతిభ.. రంగులమయంగా మారిన లైట్ హౌజ్
- పాతకాలం నాటి లైట్ హౌస్ నేడు రంగుల దీపస్తంభంగా మారింది
Spanish Cantabria lighthouse colorful |
సముద్రంలోని ప్రయాణించే నావికులకు దారి చూసేందుకు లైట్ హౌస్ లను ఏర్పాటు చేస్తుంటారు. చాలా సముద్ర తీరాల్లో లైట్ హౌస్ లు కన్పిస్తుంటాయి. రాత్రివేళ్లలో లైట్ హౌస్ వెలుగులను తిలకించేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు.
పగటిపూట వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలాచోట్ల లైట్ హౌస్ లు కళావిహీనంగా మారుతుంటాయి. అయితే కొన్నిచోట్ల మాత్రం ప్రభుత్వాలు లైట్ హౌస్ లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
స్పెయిన్ లోని కాంట్రాబ్రియా ప్రాంతంలో 90ఏళ్ల నాటి లైట్ హౌస్ ఉంది. ఇదివరకు ఈ లైట్ హౌస్ కు అప్పుడప్పుడు రంగులు వేసేవారు. అంతకు మించి ఈ లైట్ హౌస్ కు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
అందరికీ దారిచూపే లైట్ కళావిహీనంగా మారడాన్ని సాన్ మిగుయెల్ అనే కళాకారుడు తట్టుకోలేకపోయాడు. తన చిన్నప్పటి నుంచి ఈ లైట్ హౌస్ ను చూస్తూ పెరిగిన సాన్ మిగుయెల్ దీనిని కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు.
అనుకున్నదే తడవుగా కాంట్రాబ్రియా లైట్ హౌస్ కు రంగులను అద్దడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల్లోనే స్పెయిన్ ఈ లైట్ రంగు దీపస్తంభంగా మారి ఆకర్షణీయంగా మారింది. ఈ రంగుల లైట్ హౌస్ ను చూాడాలంటే స్పెయిన్ కు వెళ్లాల్సిందే..!
0 Comments