‘కరిష్మా’కు బ్రిటీష్ ఎయిర్ వేస్ క్షమాపణ..!

  • రీఫండ్ ఆలస్యంపై కరిష్మా కొటక్ ట్వీట్.. సారీ చెప్పిన బ్రిటీష్ ఎయిర్ వేస్

heroine karishma kotak, Actress karishma kotak, karishma kotak chiranjeevi movies, karishma kotak images, karishma kotak tweets
Actress Karishma kotak

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా కరిష్మా కొటక్ కు బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కరిష్మా కొటక్ హీరోయిన్ గా.. న్యూస్ ప్రజెంటర్ గా.. ఐపీఎల్ హోస్టుగా రాణిస్తూ అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 

కరిష్మా కొటక్ ప్రస్తుతం లండన్లో సెటిల్ అయిపోయింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పిక్స్.. వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. 

కరిష్మా కొటక్ కు బ్రిటిష్ ఎయిర్ వేస్ తాజాగా సారీ చెప్పడంపై ఆమె ట్వీటర్లో స్పందించింది. కరిష్మా కొటక్ తరుచూ విదేశాలకు వెళుతూ ఉంటుంది. ఇదే క్రమంలో 2020లోనూ విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకొని రద్దు చేసుకుంది. 

బ్రిటిష్ ఎయిర్ వేస్ ఇప్పటి వరకు తన డబ్బులను రిఫండ్ చేయకపోవడంపై కరిష్మా కొటక్ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై బ్రిటిష్ ఎయిర్ వేస్ వెంటనే స్పందిస్తూ కరిష్మా కొటక్ కు సారీ చెప్పింది. 

బ్రిటిష్ ఎయిర్ వేస్ తన ట్వీట్ కు స్పందిస్తూ వెంటనే రిప్లయ్ ఇవ్వడంపై కరిష్మా కొటక్ సైతం థ్యాంక్స్ చెప్పింది. ఈ ట్వీట్ ను కరిష్మా కొటక్ తన ట్వీటర్లో పోస్టు చేసింది. కరిష్మా కొటక్ తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంది.