కేజీఎఫ్-2 చేతులు మారుతుందా?
- కేజీఎఫ్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు వినికిడి.
కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్-1 మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో కేజీఎఫ్-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2ను ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. కేజీఎఫ్-1 మూవీని తెలుగులో వారాహి సంస్థ విడుదల చేసింది.
తెలుగులోనూ కేజీఎఫ్-1 భారీ విజయం సాధించడంతో వారాహి సంస్థ లాభాలు గడించింది. దీంతో కేజీఎఫ్-2 హక్కులను సైతం వారాహి సంస్థను దక్కించుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా దిల్ రాజు కేజీఎఫ్-2 మూవీ హక్కులను దక్కించుకున్నాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.
కేజీఎఫ్-2 మూవీని జనవరిలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడం.. అప్పటికి థియేటర్లలో 50శాతం అక్యుపెన్సీనే ఉండటంతో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం థియేటర్లు ఫుల్ రన్ తో నడుస్తుండటం.. ప్రేక్షకులు సైతం కరోనాను లెక్క చేయకుండా థియేటర్లకు వస్తుండటంతో కేజీఎఫ్ టీం మూవీని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తోంది.
ఈక్రమంలోనే కేజీఎఫ్-2 మూవీని టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు దక్కించుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నారు. కేజీఎఫ్-2 థియేటర్ హక్కులను 65కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వారాహి సంస్థ కేజీఎఫ్-2 హక్కులను కోల్పోయినట్లుగా కన్పిస్తోంది.
కేజీఎఫ్-2 మూవీలో యశ్ కు జోడీగా శ్రీనిధిశెట్టి నటిస్తోంది. కేజీఎఫ్-1లోనే యశ్ కు జోడీగా ఆమెనే నటించింది. కేజీఎఫ్-2లో పలువురు బాలీవుడ్ స్టార్.. సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. సంజద్ దత్ విలన్ గా నటిస్తుండగా రవినా టాండన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
కేజీఎఫ్-2 మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. జూలై 16న తెలుగు, తమిళం, కన్నడ. హిందీ భాషల్లో విడుదలకానుంది. టీజర్లోనే రికార్డులను కొల్లగొట్టిన కేజీఎఫ్-2 కలెక్షన్లలో సునామి సృష్టించడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.
0 Comments