ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ట్రైలర్ రిలీజ్
- మొమెరీ మరిచిపోయిన పరిణీతి చోప్రా
- మర్డర్ కేసులో ఇరుక్కున్న పరిణీతి ఎలా బయటిపడింది?
- ఫిబ్రవరి 26న నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ‘ది గర్ల్ ఇన్ ది ట్రైన్’
పరిణీతి చోప్రా(twitter/Parineeti Chopra@ParineetiChopra) |
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. గ్లామర్ పాత్రలకే పరిమితమైన పరిణీతి చోప్రా చాలారోజుల తర్వాత నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలో కన్పించబోతుంది.
ది గర్ల్ ఆన్ ది ట్రైన్ మూవీలో పరిణీతి చోప్రా భర్త నుంచి విడాకులు తీసుకొని డిప్రెషన్ కు గురైన మహిళ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది.
అదితిరావ్ హైదరీ(twitter/Parineeti Chopra@ParineetiChopra) |
ది గర్ల్ ఆన్ ది ట్రైలర్ ను నెట్ ఫిక్స్ తాజాగా విడుదల చేసింది. 2.16నిమిషాల నిడివితో విడుదలైన ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ తొలి నుంచి చివరికి వరకు ఆసక్తికరంగా చూపించారు.
పరిణీతి చోప్రా ప్రతీరోజు ట్రైన్లో వెళుతుంటుంది. అలా వెళుతూ తన పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఈక్రమంలోనే పరిణీతి చోప్రా మర్డర్ కేసులో ఇరుక్కుపోవడం.. తన మొమరీ లాస్ అవడం లాంటివి ట్రైలర్లో చూపించారు.
The Girl on the Train trailer |
పరిణీతిచోప్రా(మీరా కపూర్) సాయంత్రం 6గంటలకు గ్రీన్ విచ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడినుంచి 6:30కు అదితిరావ్ హైదరి(నూస్రత్) ఇంటికి 6:30కు వెళుతోంది. ఆ తర్వాత మీరాకపూర్ రాత్రి 11గంటలకు ఇంటికి చేరుకుంటుంది.
అదితిరావ్ హైదరీ గ్రీన్ విచ్ ఫారెస్టులో మర్డర్ కావడం.. పరిణీతి చోప్రా మెమరీ లాస్ అవడం.. తాను ఎంత గుర్తు చేసుకున్నప్పటికీ గతం గుర్తుకురాకపోవడం లాంటివి దర్శకుడు రిబూదాస్ ఆసక్తికరంగా చూపించారు.
ది గర్ల్ ఆన్ ది ట్రైన్ షూటింగ్ అంతా రెండునెలలపాటు లండన్లో జరిగింది. మర్డర్ మిస్టరీని పరిణీతి చోప్రా ఎలా బయట పెట్టిందనేది సస్పెన్స్ ను తలపించనుంది. ఈ మూవీని ఫిబ్రవరి 26న నెట్ ఫిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
•THE GIRL IN THE TRAILER•
— Parineeti Chopra (@ParineetiChopra) February 3, 2021
26th Feb, Netflix!#TGOTT @aditiraohydari @IamKirtiKulhari @avinashtiw85 @tota_rc @SHAMAUN @ribhudasgupta @Shibasishsarkar @RelianceEnt @amblin @ZeeMusicCompany @NetflixIndia https://t.co/5KuzJS8iRJ pic.twitter.com/m9JGA16L6h
0 Comments