Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Megastar Chiranjeevi sensational comments before Samantha

 ఆ అవకాశం ఉంటే భూస్థాపితం చేస్తా.. దటీజ్ చిరు అంటున్న అభిమానులు..!

  • ఆహాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. 

samantha chiranjeevi
Mega star Image source: twitter

గడిచిన సమయం తిరిగి రాదు. ఇప్పుడున్న సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకుంటే భవిష్యత్తులో ఫలితం అంత బాగుంటుంది. లేదంటే ఫలితం కూడా రివర్స్ అవుతుందని అందరికీ తెల్సిందే. 

ఇక ఎవరికైనా కాలంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎలా ఉంటుంది.? ఆ ఊహే బాగుంది కాదా.. అలాంటి అవకాశం మీరు ఏం చేస్తారో ఏమోగానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక పని చేస్తానని చెప్పి అందరి మనస్సును గెలుచుకున్నారు. 

మెగాస్టార్ చెప్పిన మాటలకు ప్రపంచంలోని ప్రతీఒక్కరు ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారో ఏ మాటలు చెప్పడం ద్వారా ప్రతీఒక్కరిని ఆకట్టుకున్నారో చూద్దాం..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆహా ఓటీటీ నిర్వహించిన ‘సామ్ జామ్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమంత హోస్టింగ్ చేస్తున్న సామ్ జామ్ కార్యక్రమం ఓటీటీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

క్రిస్మస్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సామ్ జామ్ షో ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయింది. హోస్ట్ సమంత చిరంజీవిని ‘కాలన్ని రివైండ్ చేసి ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటే మీరు ఏం చేస్తారు?’ అంటూ ప్రశ్నించింది. 

ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘నిజంగా అలాంటి అవకాశం వస్తే.. కరెక్ట్ గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి.. చైనాకు వెళ్లి.. ఎక్కడి నుంచి ఐతే కరోనా వైరస్ లీకైందో.. ఆ బిల్డింగ్ ను భూస్థాపితం చేసి కరోనా వైరస్ రాకుండా చేయాలని తనకు ఉందని’ మెగాస్టార్ చెప్పారు. 

మెగాస్టార్ వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయనది ఎంత పెద్ద మనస్సు అర్థం చేసుకోవచ్చు.. ఎలాంటి స్వార్థం లేకుండా ఆయన ఆలోచిస్తారు.. అనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా కన్పిస్తున్నాయని అభిమానులు.. నెటిజిన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నడిస్తోంది. ఆచార్యలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ పాత్రల్లో కన్పించబోతున్నారు. 

ఆచార్య మూవీని కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సినిమాకు మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

Also Read: సుధాకర్ దంపతులకు మెగాస్టార్ సపోర్ట్..!

Post a Comment

0 Comments