సుధాకర్ దంపతులకు మెగాస్టార్ సపోర్ట్..!
- చిరంజీవి సపోర్టు మరువలేనిదంటున్న సుధాకర్.. హరిక.
![]() |
సుధాకర్ కోమాకుల (Facebook/Sudhakar Komakula) |
సుధాకర్ కోమాకుల దంపతులు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా చిరంజీవి వారిద్దరితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి కుశల ప్రశ్నలు అడిగారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సుధాకర్ కోమాకుల టాలీవుడ్ కు పరిచయమ్యాడు. ఆ తర్వాత కుందనపు బొమ్మ.. నువ్వు తోపురా.. సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇటీవల సుధాకర్ దంపతులు చిరంజీవి గతంలో నటించిన ‘ఛాలెంజ్’ సినిమాలోని ‘ఇందువదన కుందరదన’ సాంగ్ రీక్రియేట్ చేశారు.
![]() |
సుధాకర్ కోమాకుల (Facebook/Sudhakar Komakula) |
2021 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చిరంజీవికి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు సుధాకర్.. హరికలు మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. చిరంజీవికి పూలబోకె అందజేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.
సుధాకర్ కోమాకుల (Facebook/Sudhakar Komakula) |
న్యూ ఇయర్లో తమ ప్రయత్నాలు విజయవంతం కావాలని సుధాకర్.. హరికలు చిరంజీవి ఆశీర్వదం తీసుకున్నారు. తన సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుందని చిరంజీవి వారికి భరోసా ఇవ్వడంతో సుధాకర్.. హరికలు సంతోషం వ్యక్తం చేశారు.
సుధాకర్.. హరికలు చిరంజీవిని కలిసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ‘ఈరోజు తన బిగ్ డే అని.. చిరంజీవి అందించిన ప్రోత్సాహం’ మరువలేనిదని సుధాకర్ కోమాకుల తన ఫేస్ బుక్ పేజీ ఈ ఫోటోలను పోస్టు చేశారు.
![]() |
సుధాకర్ కోమాకుల (Facebook/Sudhakar Komakula) |
ఈ ఫొటోలను చూసిన అభిమానులు ముచ్చపడిపోతూ తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. సుధాకర్ దంపతులు కోరుకున్నట్లు ఈ ఏడాది వారికి సక్సస్ దక్కాలని అభిమానులు కామెంట్స్ చేస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
0 Comments