Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Nidhi Agarwal is the Tamil director who bothered him

  నిధి అగర్వాల్ ను ఇబ్బంది పెట్టిన తమిళ డైరెక్టర్..!

  • శింబుకు ఐ లవ్ యూ చెప్పాలని నిధిపై ఒత్తిడి చేసిన డైరెక్టర్ సుశీంద్రన్ పై నెటిజన్ల ఆగ్రహం..!
nidhi agarwal Eshwaran

నిధి అగర్వాల్ (twitter/Nidhi Agarwal)


ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్లో ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ మూవీ విజయంతో నిధి అగర్వాల్ కు టాలీవుడ్లోతోపాటు అన్ని భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి.

నిధి అగర్వాల్ టాలీవుడ్లోతోపాటు కోలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బీజీ హీరోయిన్ గా మారింది. కోలివుడ్లోలో ఈశ్వరన్.. భూమి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు కోలీవుడ్లో సంక్రాంతికి విడుదల కానున్నాయి. 

నిధి అగర్వాల్ నటించిన ఈశ్వరన్ మూవీ జనవరి 14న సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేసింది. ఈక్రమంలో జనవరి 3న ఈశ్వరన్ మూవీ ఆడియో రిలీజ్ చేశారు. 

ఈశ్వరన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నిధి అగర్వాల్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి మాట్లాడింది. నిధి అగర్వాల్ మాట్లాడుతుండగా డైరెక్టర్ సుశీంద్రన్ శింబుకు ‘ఐ లవ్ యూ’ చెప్పాలని ఒత్తిడి తెచ్చాడు. 

నిధి అగర్వాల్ డైరెక్టర్ మాటలను పట్టించుకోకుండా స్పీచ్ కంటిన్యూ చేస్తుండగా సుశీంద్రన్ పదేపదే శింబుకు ఐ లవ్ యూ చెప్పాలని కోరడంతో నిధి అగర్వాల్ నర్వస్ గా ఫీలైంది. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిని చూసిన నిధి అగర్వాల్ అభిమానులు డైరెక్టర్ సుశీంద్రన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

డైరెక్టర్ సుశీంద్రన్ ఈ వీడియో క్లిప్ పై స్పందిస్తూ తాను నిధి అగర్వాల్ ను కావాలని ఇబ్బంది పెట్టలేదని.. ఈ సినిమాలో ‘మామా లవ్ యూ’ అంటూ నిధి అగర్వాల్ శింబు వెంటపడుతుందని తెలిపారు. 

ఈ డైలాగ్ చెప్పాల్సిందిగా నిధి అగర్వాల్ ను కోరానని.. నిధిని ఇబ్బంది పెట్టాలని కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో చూశాక తనకు కూడా నిధి అగర్వాల్ ను ఇబ్బంది పెట్టిననే ఫీలింగ్ కలిగిందని.. అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని డైరెక్టర్ చెప్పాడు. 

Post a Comment

0 Comments