గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. SSC CGL-2021 నోటిఫికేషన్ విడుదల
SSC CGL-2021 |
2020 డిసెంబర్ 29న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఖాళీల వివరాలను మాత్రం ఎస్ఎస్సీ ప్రకటించలేదు. అయితే ప్రతియేటా మాదిరిగానే వేలల్లో పోస్టుల సంఖ్య ఉండే అవకాశం ఉండనుంది.
2021 జనవరి 31 వరకు గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు గడువు ఉందని ఎస్ఎస్సీ ప్రకటించింది. వివిధ కేటగిరిల్లోని పోస్టులకు 18నుంచి 32ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని స్టాప్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొంది.
2020-21 ఏడాది ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్ఎస్సీ తన అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. టైర్ 1.. టైర్ 2.. టైర్ 3.. టైర్ 4 కేటగిరిల్లో పరీక్షలు నిర్వహించి పోస్టులను భర్తీ చేయనున్నారు.
టైర్-1 పరీక్షను మే 29 నుంచి జూన్ 7 తేదిల మధ్య నిర్వహించనున్నారు. టైర్-2.. టైర్-3 రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనుంది. టైర్-1 అడ్మిట్ కార్డులు మే నెలలో అందుబాటులో ఉంచనుంది. టైర్-1 ఫలితాలను జూలైలో వెల్లడించనున్నట్లు ఎస్ఎస్సీ పేర్కొంది.
గతేడాది సీజీఎల్ నుంచి 8581 పోస్టులను భర్తీ చేయగా వీటిలో జనరల్ క్యాటగిరీల్లో 3674 పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది పోస్టుల సంఖ్య మాత్రం ప్రకటించలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.
Also Read: సింగరేణిలో భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు..!
Also Read: రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలు-1004.. ముగియనున్న గడువు..!
0 Comments