టెస్లా కార్లకు పోటీనిచ్చేది నియో ఈటీ7 కారేనా..!
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిలోమీటర్లు అవలీలాగా ప్రయాణించే అవకాశం ఉండటం నియో ఈటీ7 ప్రత్యేకత.
Neo ET7 car |
జనరేషన్ మారుతోంది.. అందుకు తగ్గట్టుగానే ఆలోచనలు మారుతున్నాయి. మన పూర్వీకులు ఎడ్లబండ్లు.. గుర్రపు బండ్లలో ప్రయాణించే వాళ్లు. ప్రస్తుతం పెట్రోల్ వాహనాలు.. డిజీల్ వాహనాల్లో ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు సులువుగా చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణాలు ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యంత వేగంగా జరిగే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.
ఇప్పటికే పలు దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఏమాత్రం హాని లేకపోవడంతో ప్రజలంతా వీటిని వినియోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ద్విచక్ర వాహనాలు.. ఫోర్ వీలర్లు ఇప్పటికే పలు దేశాల్లో వినియోగంలో ఉన్నాయి.
ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల రంగం పుంజుకుంటోంది. రానున్న రోజుల్లో వీటి వినియోగం భారీగా పెరిగే అవకాశం కన్పిస్తుంది. పలు కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్లా కంపెనీ ముందుంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీపై టెస్లా కంపెనీ తొలి నుంచి ఆసక్తి కనబరుస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం ఆసక్తి చూపుతున్నాయి. అయితే టెస్లా కంపెనీకి పోటీగా చైనాకు చెందిన నియో ఈటీ7కారు పోటీ ఇస్తుందనే టాక్ ఆటో ఇండస్ట్రీలో విన్పిస్తోంది.
నియో ఈటీ7 కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 621మైళ్లు(సుమారు వెయ్యి కిలోమీటర్లు) ప్రయాణించగలదు. నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారులో 150కిలో వాట్/గంటల బ్యాటరీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అవసరమైతే నిమిషాల వ్యవధిలో బ్యాటరీని మార్చుకునేలా దీనిని డిజైన్ చేశారు.
నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారు 480 కిలోవాట్లు లేదా 643 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు టైర్ల ద్వారా 180కిలోవాట్లు.. వెనుక టైర్ల ద్వారా 300కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. కేవలం 3.9సెకన్ల వ్యవధిలో నియో ఈటీ7 కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
నియో ఈటీ7కారులో 33కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రైవర్ లేకుండా కూడా వినియోగించుకునేలా ఈటీ7కారును రూపొందించారు. టెస్టింగ్ దశలో ఉన్న ఈటీ7కారును వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురావాలని చైనా కంపెనీ భావిస్తోంది. అదేవిధంగా ఈటీ7 బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు నియో పవర్ స్వాప్ 2.0పేరుతో ఓ కొత్త వ్యవస్థను ఆ కంపెనీ రూపొందిస్తుంది.
Also Read: బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్ ధర అందుబాటులోనే..!
0 Comments