Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Parineeti Chopras Sugarcane Eating Video goes Trending

 పరిణీతి చోప్రా మరీ ఇంత సుఖుమారా..!

  • కొరకడం ప్రాక్టీసు చేయమంటున్న నెటిజన్లు.. ‘ప్రాక్టీస్ మేక్స్ పరిణీతి ఫర్ ఫెక్ట్’ అంటూ కామెంట్స్..

పరిణీతి చోప్రా (twitter/Parineeti_FC)

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మరీ సుఖుమరంగా తయారవుతోంది. గ్లామర్.. యాక్టివ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పరిణీతి చోప్రా ఇంకా తండ్రి చాటు బిడ్డగానే పెరుగుతోంది. 

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న పరిణీతి చోప్రా తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చూసిన వీడియోను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ వీడియో పరిణీతి చోప్రా తన తండ్రితో కలిసి చెరుకుగడ తినేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 

పరిణీతి చోప్రాకు ఆమె తండ్రి పవన్ చోప్రా చెరకుగడ ఎలా తినాలో నేర్పిస్తున్నా వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోలో పవన్ చొప్రా చెరుకుగడను అవలీలా తినేస్తుండగా.. పరిణీతి మాత్రం చాలా చెరుకుగడను కోరికేందుకు చాలా ఇబ్బందులు పడింది. 

చెరుకుగడను తినడంతో తాను ఫెయిల్ అయ్యానని.. తన తండ్రి నుంచి కొత్త ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని అనుకున్న ప్రతీసారి తాను నెర్వస్ ఫీల్ అవుతానని పరిణీత్రి చోప్రా ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. తన తండ్రి ప్రతీ విషయంలో ఫర్ ఫెక్ట్ అంటూ కితాబిచ్చింది.

పరిణీతి మేసేజ్ చూసిన నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు అభిమానులు పరిణీతి క్యూట్ అంటుండగా మరికొందరేమో పరిణీతి నువ్వు రోజు చెరుకుగడలను కొరకడం ప్రాక్టీస్ చేయ్.. ‘ప్రాక్టీస్ మేక్ పరిణీతి ఫర్ ఫెక్ట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా కొందరు మాత్రం పరిణీతి చోప్రాకు మరీ ఇంత సుఖుమారం తగదని.. మా ఏరియాలో చిన్న పిల్లలు చెరుకుగడలను అవలీలాగా తింటారని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే పరిణీతి చోప్రా ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఇటీవల సైన్ చేసినట్లు సమాచారం. ‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’ దర్శకుడు రిభుదాస్ గుప్తా డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీలో పరిణీతి చోప్రా నటించనుందని టాక్ విన్పిస్తోంది. 

కరోనా కారణంగా షూటింగులకు బ్రేక్ రావడంతో పరిణీతి చోప్రా ప్రస్తుతం హర్యానాలోని అంబాలలో వ్యవసాయ జీవితాన్ని గడుపుతోంది. ఈక్రమంలోనే అభిమానులు ఇచ్చిన సలహాను పాటించి పరిణీతి చోప్రా త్వరలోనే చెరుకుగడను తినడంలో ఫర్ ఫెక్ట్ అవుతుందని ఆశిద్దాం..!

Post a Comment

0 Comments