భారత్ లో కైగర్ నుంచి ఆవిష్కరించిన రెనో
- రెనాల్ట్ నుంచి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీగా రానున్న కైగర్
Renault Kaiger |
ఆటో రంగంలో దిగ్గజంగా ప్రెంచ్ కంపెనీ రెనో కొనసాగుతోంది. సరికొత్త మోడళ్లలో కార్ల తయారు చేస్తున్న రెనో కంపెనీ సరికొత్త మోడళ్లను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా రెనో నుంచి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీగా కైగర్ మోడల్ ను తీసుకొచ్చింది. ఇండియాలో కైగర్ మోడల్ ను రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ గురువారం ఆవిష్కరించారు.
రెనో నుంచి వస్తున్న మూడో మోడల్ కారు కైగర్ కావడం విశేషం. క్విడ్.. ట్రైబర్ తర్వాత రెనో నుంచి వస్తున్న కైగర్ భారత్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కైగర్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెనో కంపెనీ కసరత్తులు చేస్తుందని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ తెలిపారు.
ఇండియాలో దూసుకెళుతున్న టాప్ మోడల్స్ అయిన మారుతి విటారా బ్రెజ్జా.. హ్యుండయ్ వెన్యూ.. కియా సోనెట్.. ఫోర్ట్ ఎకోస్పోర్ట్స్.. టాటా నెక్సాన్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 300.. నిస్సాన్ మాగ్నైట్‌కు కైగర్ పోటీ ఇవ్వనుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కైగర్ మోడల్లో అమర్చిన టర్బోచార్జ్‌డ్ ఒక లీటర్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు దాదాపు 20కిలోమీటర్ల మైలజీని ఇవ్వనుంది. దీనిలో మల్టిపుల్ డ్రైవ్ మోడల్ సదుపాయాన్ని కల్పించారు. మోడల్ విడుదల తేది.. ధరను త్వరలోనే వెల్లడించనున్నట్లున్నట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ తెలిపారు.
అయితే కైగర్ ప్రారంభ ధరను రూ.5.50 లక్షల స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. కైగర్ మోడల్ ద్వారా కార్ల విక్రయాల్లో యాభైశాతం వాటా కలిగిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి రెనో కంపెనీ అడుగుపెడుతుందని తెలిపారు. కైగర్ మోడల్ భారత్ విజయవంతం అవుతుందని వెంకట్రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
0 Comments