వెండితెర.. బుల్లితెరపై సామ్ ‘మెరుపులు’

samantha akkineni, samantha sakunthalam, samantha movies, samantha sakunthalam latest news, sakunthalam movie shooting, sakunthalam movie start, samantha sakunthalam.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత కూడా తన జోరు చూపిస్తున్నారు. సమంత పెళ్లికి ముందు గ్లామర్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సామ్ గ్లామర్ షో చేస్తూనే నటన ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు వెండితెరపై హోస్టుగా చేస్తూ ఓటీటీల్లో వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. 

సమంత అక్కినేని నటించిన ఫ్యామిలీ మ్యాన్-2 సీజన్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కు రెడీ అవుతోంది. మరోవైపు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పీరియాడికల్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ మార్చి 20న ప్రారంభం కానుందని సమాచారం. 

samantha akkineni, samantha sakunthalam, samantha movies, samantha sakunthalam latest news, sakunthalam movie shooting, sakunthalam movie start, samantha sakunthalam.

శాకుంతలంలో సమంత అక్కినేని మరింత గ్లామర్ గా కన్పించబోతున్నారని టాక్ విన్పిస్తోంది. విశ్వామిత్ర.. మేనల కూతురు అయిన శకుంతల లుక్స్ కోసం సమంత కసరత్తులు మొదలుపెట్టింది. లుక్స్ పరంగా అభిమానులను ఆకట్టుకునేందుకు సమంత ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీ పట్టాలపై ఉండగా సమంత అక్కినేని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీలో నటిస్తుందనే టాక్ విన్పిస్తోంది. 

ఈ రెండు సినిమాలతోపాటు సమంత ప్రస్తుతం విజయ్ సేతుపతి-నయనతారతో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. దీంతోపాటు మాయ ఫేం శరవణ్ తో మరో వైపు చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమంత అక్కినేని పెళ్లి తర్వాత కూడా తన జోరు చూపిస్తుండటంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Also Read: అద్భుత ప్రేమకావ్యంలో సామ్.. శాకుంతలం పట్టాలెక్కేది అప్పుడే..!